ఆకుపచ్చ రంగుగా మారిన మంజీరా వాగు..

by Sumithra |
ఆకుపచ్చ రంగుగా మారిన మంజీరా వాగు..
X

దిశ, చిలిపిచెడ్ : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో గల అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి ఆలయ పరిసర ప్రాంతంలో గల మంజీరా నదిలో ఉన్నట్టుండి స్వచ్ఛమైన నీరు కాస్త ఆకుపచ్చ రంగులోకి మారి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వాగులోకి వెళ్లగా ఆ వాగులో ఉన్న ఆకుపచ్చ రంగులో మారిన నీటిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వచ్ఛమైన నీళ్లు ఆకుపచ్చ రంగులో మారడానికి నది ప్రవాహంలో వివిధ ఫార్మా కంపెనీల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు, రసాయనాలే కారణం అంటున్నారు.

వాటి ద్వారానే నీళ్లు కలుషితమవుతున్నాయని, దీంతోనే ఈ స్వచ్ఛమైన నీరు కాస్త ఆకుపచ్చ రంగులో మారి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అమ్మవారి సన్నిధిలో గల మంజీరా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని అక్కడి భక్తుల నమ్మకం. అలాంటిది మంజీరా నదిలో ఆకుపచ్చ రంగులో నీళ్లు కనిపించడంతో స్నానాలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. స్నానాలు చేయకుండానే దైవ దర్శనానికి ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని కలుషితం చేస్తున్న కంపెనీల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పలువురు కోరుతున్నారు. వాగులోని నీళ్లలో స్నానాలు చేసేందుకు భక్తులు జంకుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed