Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ బర్త్ డే స్పెషల్.. ‘శంబాల’ మూవీ నుంచి ఫైరింగ్ పోస్టర్ విడుదల

by Hamsa |
Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ బర్త్ డే స్పెషల్.. ‘శంబాల’ మూవీ నుంచి ఫైరింగ్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిఫరెండ్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). దీనిని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్ ముని(Yugandhar Muni) హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తుండగా.. రాజశేఖర్ అన్నభీమోజు(Rajasekhar Annabhimoju), మహింధర్ రెడ్డి షైనింగ్ పిక్చర్స్(Shining Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్(Archana Iyer) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో శ్యాసిక, రవి వర్మ(Ravi Verma), మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే దీనికి శ్రీరామ్ మద్దూరి(Sriram Madduri) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడుదలై హైప్ పెంచాయి. నేడు ఆది సాయి పుట్టిన రోజు కావడంతో మేకర్స్ విషెస్ చెబుతూ ఫైరింగ్ పోస్టర్‌(Firing poster)ను షేర్ చేశారు. ఇందులో ఆది సూటు బూటు వేసుకుని కోపంగా సైకిల్ తొక్కుతూ వస్తుండగా.. వరి చేను అంతా మంటలతో తగలబడిపోతున్నట్లు ఉంది. ఇక ఈ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు.

Advertisement

Next Story

Most Viewed