అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే

by Kalyani |
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే
X

దిశ ,బయ్యారంః మండలంలోని అర్హులైన వారు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని, అధికారుల పర్యవేక్షణ మేరకు ఇందిరమ్మ ఇల్లు వస్థాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. సోమవారం బయ్యారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణ నమూనాకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య భూమి పూజ చేసి ,శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మండలంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు ఇంటి జాగా 70,80 గజాల స్థలం ఉండాలని అన్నారు. ఇంటి నిర్మాణమునకు నోచుకోని వారు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు రూ. 5 లక్షలతో నాలుగు విడతలుగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా హౌసింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాలని కోరారు.

అనంతరం మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో రామచంద్రాపురం రోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతుల నుంచి సాధక బాధకాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో సుమారుగా పదివేల బస్తాలు కాంటాలు నిర్వహించిన గన్ని బస్తాలను సంబంధిత జిల్లా అధికారులు మిల్లర్లకు ఆర్ఓఆర్ ఇచ్చి జాప్యం లేకుండా, ధాన్యం తరలించాలని, లేని ఎడల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో ధాన్యం డంపు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా జెసి ఫోన్ ద్వారా ఆదేశించారు. దీంతో అధికారులు తక్షణమే ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేస్తామని , జిల్లా జేసి ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

అనంతరం గంధం పెళ్లిలోని ఈ మధ్యకాలంలో డాక్టరేట్ పొందిన కల్పనా దేవిని కలిసి అభినందించారు. అదేవిధంగా మృతుడు ఈసం రవి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి రాజయ్య ఏఈలు జగదీష్, లాల్ సాబ్ మండల తహసీల్దార్ బి. విజయ ,ఎంపీడీవో విజయలక్ష్మి , సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి చెరుకుపల్లి నాగమణి నాయకులు వెంకటపతి, వెంకటేశ్వర్లు , గణేష్ ,మంగిలాల్ , శ్రీనివాస్ ,ఉపేందర్ ,రవి ,మండలంలోని గ్రామ పంచాయతీ ల ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story