Tollywood: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 14:53:29.0  )
Tollywood: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమ(Tollywood)లో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కాగా, శ్యామ్ బెనగల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అంతేకాదు.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను శ్యామ్ బెనగల్‌(Shyam Benegal) దక్కించుకున్నారు.

1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌ సమీపంలోని అల్వాల్‌లో శ్యామ్ బెనగల్‌ జన్మించారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. 2013లో ఏఎన్నార్ జాతీయ అవార్డుతో పాటు మొత్తం ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంకుర్, నిశాంత్, మంథన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed