- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INC: ఐకాన్ స్టార్ ఎవరిని చంపినా పర్వాలేదా..? మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్(Icon Star) కు ప్రత్యేక రాజ్యాంగం(Special Constitution) ఉంటుందా అని, ఐకాన్ స్టార్ అయితే ఎవరినైనా చంపినా పర్వాలేదా..? అని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister komatireddy Venkatreddy) అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sriteja)ను పరామర్శించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest) పై బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ఐకాన్ స్టార్ అరెస్ట్ చేస్తారా అని అంటున్నారని.. ఐకాన్ స్టార్ కి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా.. ఆయన ఎవరిని చంపినా పర్వాలేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ప్రధాని అయినా సర్పంచ్ అయినా ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టం ఉంటుందని, పోలీసులు 11 రోజులు విచారణ చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు జైలుకు వెళ్లొచ్చి, స్మార్ట్ గా తయారైన అల్లు అర్జున్ ను పరామర్శించారు కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాబును పరామర్శించేందుకు ఆసుపత్రికి మాత్రం రాలేదని ఫైర్ అయ్యారు. జింకను చంపిన కేసులో ఇంటర్నేషనల్ స్టార్ సల్మాన్ ఖానే(Salman khan) 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని, ఈ ఐకాన్ స్టార్ ఎంత అని అన్నారు. అంతేగాక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరణ ఇచ్చారని, దీనికి ప్రెస్ మీట్ పెట్టి నన్ను, సీఎం ను అలా అనడం కరెక్ట్ కాదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అల్లు అర్జున్ ని రిక్వెస్ట్ చేస్తున్నానని, ఇకనైనా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని కోరారు.
Read More..
T Congress : అల్లు అర్జున్ అలా చేసి ఉండాల్సింది : చామల కిరణ్ కుమార్ రెడ్డి