సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Aamani |
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల్ కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ అర్జీలను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లక్ష్మి నారాయణ, నర్సింగరావు,ఆర్డీఓ ఇంచార్జ్ శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed