- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Daku Maharaj: నిర్మాత, డైరెక్టర్ కామెంట్స్‌తో ‘డాకు మహారాజ్’ పై పెరుగుతున్న హైప్
దిశ, సినిమా: నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi), సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషనల్ కంటెంట్‌తో చిత్రంపై హైప్ పెంచేస్తున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘గత 20-30 ఏళ్ళలో ఎప్పుడు చూడనంత కొత్తగా 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ కనిపించబోతున్నారు. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటిగా 'డాకు మహారాజ్' నిలుస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది’ అని తెలిపారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. ‘పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు.