Drinker Sai: దృష్టంతా ‘డ్రింకర్ సాయి’ పైనే.. నిర్మాత కామెంట్స్

by sudharani |
Drinker Sai: దృష్టంతా ‘డ్రింకర్ సాయి’ పైనే.. నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai). బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ (Brand of Bad Boys) అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalashetty) దర్శకత్వం వహిస్తుండగా.. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘డ్రింకర్ సాయి’ ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అ‌వుతోంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత బసవరాజు లహరిధర్ (Basavaraja Laharidhar) సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘డ్రింకర్ సాయి’ సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవికి కథ చెప్పాం. ఆయన విని ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రోత్సాహంతో ‘డ్రింకర్ సాయి’ సినిమా స్టార్ట్ చేశాం. ఇందులో నటించిన వాళ్లు అందరూ పాత్రకు తగ్గట్లుగా చాలా బాగా యాక్ట్ చేశారు. కంటెంట్ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. మా సినిమా కంటెంట్ మీద కూడా నమ్మకం ఉంది. సక్సెస్ అందుకుంటామనే ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం. డ్రింకర్ సాయి రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కోసం సన్నాహాలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed