Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలని నోటీసులు

by Ramesh Goud |   ( Updated:2024-12-23 16:32:22.0  )
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలని నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) కు పోలీసులు నోటీసులు(Notieces) అందజేశారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణ(Equiry)కు హాజరు కావాలని ఆదేశించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stompade) ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ(Sriteja) ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌కు సోమవారం సాయంత్రం 8 : ౩౦ గంటల సమయంలో నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒకరోజు చంచల్‌గూడ జైలులో గడిపిన విషయం తెలిసిందే. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలై ఇంటికొచ్చారు.

Read More ...

శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప మూవీ నిర్మాత రూ.50 లక్షల ఆర్థికసాయం


Advertisement

Next Story

Most Viewed