- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్టలు, రాళ్లు, రహదారుల గుర్తింపు కోసమే రైతుబంధు ఆలస్యం
దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కావస్తుందని, ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉందని, ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని, గత ప్రభుత్వం చేసిన తప్పుదాలను మేము చేయొద్దనే ఉద్దేశంతో పథకాల అమలులో ఆలస్యం జరుగుతుందని అందరూ సహకరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని దేవకి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు మంజూరైన 78 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ… గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రూ.6,500 కోట్లు అప్పు చేశారని, ప్రస్తుతం ఆ అప్పులకు వడ్డీ కట్టలేక ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతుందని, మన ఇంట్లో కుటుంబంలాగే ప్రభుత్వమని తనదైన శైలిలో ప్రసంగించి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మహిళలను ఆకట్టుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు గుట్టలు, రాళ్లు, రోడ్లకు రైతుబంధు ఇచ్చారని, అలాంటి తప్పులు మేము చేయకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాని అమలు చేయడానికి కాస్త ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు కూడా రైతుబంధు చెక్కు వస్తే తిరిగి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చానని సూచించారు. గతంలో శ్రీశైలం రహదారి కూడా చెక్కులు ఇచ్చిన ఘనత ఆ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు.
ప్రభుత్వం కాస్త తేరుకున్నాక తులం బంగారం కూడా ప్రతి మహిళకు అందిస్తామని, ఎవరు కూడా అధైర్య పడకూడదని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకుని అబద్దాన్ని 100 సార్లు చెప్పి ఆ అబద్ధాన్ని కూడా నిజం చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి అలాంటి వాటిని తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మించుకోవడానికి మోడల్ హౌస్ ను వెంటనే నిర్మించాలని ఎంపీడీవో శ్రీకాంత్ కు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షల చొప్పున విడతలవారీగా డబ్బులు ఇవ్వబడునని అన్నారు.
ఎంపీడీవో శ్రీకాంత్ పై ఎమ్మెల్యే ఆగ్రహం
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా చంద్రధన గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి మాట్లాడుతూ… గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు గుర్తిస్తున్న సమయంలో పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్లు సర్వే నిర్వహిస్తూ, ఎవరి కూడా ఇండ్లు రావని, ఎందుకు అప్లై చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని, బదులాం చేస్తున్నారని సూచించారు. వెంటనే ఎమ్మెల్యే కసిరెడ్డి సమావేశంలోనే ఉన్న ఎంపీడీవో శ్రీకాంత్ పై మీరు ఏం చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి మందలించే బాధ్యత నీపై లేదా అని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అలాంటి అధికారులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఉన్నత అధికారులకు స ఇక్కడి నుండి రిమూవ్ చేసి పంపించాలని, రాష్ట్రంలో చాలామందికి ఉద్యోగాలు లేక ఖాళీగా రోడ్లపై తిరుగుతున్నారని మండిపడ్డారు.
మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని తనదైన శైలిలో మందలించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాటగీత నరసింహ , వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, పీసీసీ కిసాన్ సెల్ కార్యదర్శి డి. మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో శ్రీకాంత్, ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్,అంజయ్య గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, శామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీ దేవి రఘు రాములు,,మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు,వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.