Weight loss : వేగంగా బరువు తగ్గుతున్నామని సంబరపడకండి.. ఎందుకంటే..!!

by Javid Pasha |
Weight loss : వేగంగా బరువు తగ్గుతున్నామని సంబరపడకండి.. ఎందుకంటే..!!
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. కాబట్టి బాధితులు ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్నిసార్లు శరీరంలో ఆకస్మిక మార్పులు సంభవించడం, ఊహించని విధంగా అధిక బరువు తగ్గుతూ రావడం వంటివి సంభవిస్తుంటాయి. దీంతో పెద్దగా కష్టపడకపోయినా ఈజీగా బరువు తగ్గుతున్నామని కొందరు సంతోష పడుతుంటారు. కానీ ఈ మార్పు వాస్తవానికి ప్రమాద సంకేతం కూడా కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేగంగా వెయిట్ లాస్ అవుతుంటే.. అది కొన్ని అనారోగ్యలవల్ల కూడా కావచ్చు. అవేంటో చూద్దాం.

* హైపోథైరాయిడిజం : అధిక బరువు ఉన్నవారు ఎన్నడూ లేనివిధంగా వేగంగా బరువు తగ్గుతున్నారంటే.. థైరాయిడ్ అధికం కావడంవల్ల కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హైపో థైరాయిడిజం జీవక్రియను నియంత్రిస్తుంది. అయితే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఆ పనిని మరింత వేగవంతం చేస్తుందని, దీనివల్ల శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని, ఫలితంగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. దీనికి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్, బీటా బ్లాకర్స్ థెరపీ వంటి చికిత్సలను ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. తరచుగా వాపునకు దారితీస్తుంది. ఫలితంగా జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గేలా ప్రేరేపిస్తుంది. అయితే ఆర్థరైటిస్‌కు ఎటువంటి నివారణ లేనప్పటికీ వాపు, నొప్పి వంటివి మేనేజ్ చేయడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* టైప్ 1 డయాబెటిస్ : చాలా మంది టైప్1 డయాబెటిస్ వల్ల వేగంగా బరువు తగ్గుతుంటారు. కాగా పలువురు తాము దీని బారిన పడ్డామని గుర్తించడంలో విఫలం అవుతుంటారు. శరీరంలో మధుమేహం ప్రారంభం అయిందని తెలియక స్లిమ్ అవుతున్నామని భ్రమకు లోనయ్యే చాన్స్ ఉంటుంది. అసలు విషయం తెలిశాక ఇబ్బంది పడతారు. టైప్ 1 బాధితుల ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ మేకింగ్ సెల్స్ రోగనిరోధక వ్యవస్థ ద్వారా దాడి చేయబడటంవల్ల ఇలా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరం ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేయకపోతే, అది గ్లూకోజ్‌ను ఇంధనంగా(fuel) ఉపయోగించవచ్చు. ఇలాంటప్పుడు కూడా కండరాల క్షీణత, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తతాయి. స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయడం, మధుమేహ నియంత్రణ పద్ధతులను పాటించడమే దీనికి చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వీటితోపాటు డిప్రెషన్, టీబీ, క్యాన్సర్ వంటివి శరీరంలో ప్రారంభమైతే కూడా వేగంగా బరువు తగ్గుతుంటారు. కాబట్టి ఆకస్మిక శారీరక మార్పులు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవడం ఉత్తమం.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed