TG: చిరంజీవి మినహా తెలుగులో అలాంటి హీరోలే లేరు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 13:46:59.0  )
TG: చిరంజీవి మినహా తెలుగులో అలాంటి హీరోలే లేరు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరో(Telugu Heros)లపై కాంగ్రెస్(Congress) కీలక నేత, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు హీరోల్లో ఎవరైనా గ్రామాలను దత్తత తీసుకొని బాగు చేశారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో సినీనటులు సేవా కార్యక్రమాలు చేస్తారు.. తెలుగులో ఎవరైనా అలా చేశారా? అని అడిగారు. తెలంగాణ కోసం యువత బలిదానం చేసుకుంటే సినిమా వాళ్లంతా చేతులు ముడుచుకొని కూర్చున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోల కంటే బాలీవుడ్(Bollywood) నటుడు సోనూసూద్(Sonu Sood) ఎంతో బెటర్ అని కొనియాడారు.


Read More..

Chiranjeevi: ఫుల్ సంతోషంలో మెగాస్టార్ చిరంజీవి.. అసలేం జరిగిందంటే? (వీడియో)


సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మధ్య తరగతి కుటుంబంవైపు నిలబడ్డారు.. మిగిలిన వాళ్లంతా బడా వ్యక్తులవైపు నిలబడ్డారు. తెలంగాణ సమాజం, సంస్కృతిపైన దాడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అందరికీ సోనూసూద్ సాయం చేశారని గుర్తుచేశారు. కావేరి నది వివాదంలో రజినీకాంత్ ఇండస్ట్రీని ఏకం చేసి నిలబెట్టారు. కానీ మన సూపర్ స్టార్‌లు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా? అని మండిపడ్డారు. చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్లాంక్ పెట్టి ఆదుకున్నారు. చిరంజీవి వారసులం అని చెప్పుకునే వారికి ఆయన ఆదర్శం ఏమైంది. నైజాం ఏరియా అభిమానులు సినిమాలు చూడకపోతే సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటని అన్నారు.

Next Story

Most Viewed