Shyam Benegal: సినిమాల్లో శ్యామ్ బెన‌గ‌ల్ ప్రత్యేకత ఇదే

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 15:57:55.0  )
Shyam Benegal: సినిమాల్లో శ్యామ్ బెన‌గ‌ల్ ప్రత్యేకత ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెగనల్(Shyam Benegal) మరణం భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. ఆయన మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివిన ఆయన.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు.

Shyam Benegal is special in moviesShyam Benegal: సినిమాల్లో శ్యామ్ బెన‌గ‌ల్ ప్రత్యేకత ఇదేసామాజిక స‌మ‌స్యలు, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న సినిమాలు రూపొందించి ప్రేక్షకుల నుంచే కాకుండా.. అనేకమంది ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఆయ‌న తీసిన సినిమాల‌కు 18 జాతీయ అవార్డులు ద‌క్కాయి. శ్యామ్ బెన‌గ‌ల్‌కు పేరు తెచ్చిన సినిమాలు.. అంకూర్(1974), నిషాంత్ (1975), మంత‌న్(1976), భూమిక‌(1977), జునూన్(1978). ప‌ద్మ‌శ్రీ(1976), ప‌ద్మ‌భూష‌ణ్‌(1991), దాదాసాహెబ్ ఫాల్కే(2005) అవార్డులు వ‌రించాయి. ఇక ఆయన తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ధ్రువీక‌రించారు.

Read More ...

Tollywood: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత


Advertisement

Next Story

Most Viewed