- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో ‘రోజ్‌గార్ మేళా’.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సాగర్‌మాల కన్వెన్షన్‌లో ‘రోజ్‌గార్ మేళా’(Rozgar Mela) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu), ఎంపీ భరత్(MP Bharat) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎంపికైనా ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్లు పంపిణీ చేశారు. అన్ని రంగాల్లో ఏపీ టాప్‌లో ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్టేనని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
కాగా కేంద్రప్రభుత్వ శాఖల్లోని హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు ఈ రోజు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ‘రోజ్ గారి మేళా’లో భాగంగా దేశవ్యాప్తంగా 71 వేల మంది యువకులకు ప్రధాని మోడీ(Prime Minister Modi) నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఈ రోజ్ గారి మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్రమంత్రులు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. విశాఖలో నిర్వహించిన రోజ్ గారి మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు నియమాక పత్రాలు అందజేసి ప్రసంగించారు.