Looting Bride : నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. మోసాలు ఎలా చేసేదో తెలుసా..?

by Sathputhe Rajesh |
Looting Bride : నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. మోసాలు ఎలా చేసేదో తెలుసా..?
X

దిశ, నేషనల్‌బ్యూరో : మూడు పెళ్లిళ్లు చేసుకుని వారి వద్ద నుంచి రూ.కోటి 25 లక్షలు వసూలు చేసిన ఓ మహిళలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో ఆలస్యం వెలుగు చూసింది. సీమా అనే మహిళ తొలుత 2013లో ఓ వ్యాపారిని వివాహం చేసుకుంది. అతనితో పాటు అతని కుటుంబంపై కేసు నమోదు చేసింది. కాంప్రమైజ్ కావడం కోసం రూ.75లక్షలు వసూలు చేసింది. 2017లో గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం అతనితో విడిపోవడానికి రూ.10లక్షలు తీసుకుంది. 2023లో జైపూర్‌కు చెందిన బిజినెస్ మెన్‌ను వివాహమాడింది. అనంతరం రూ.36లక్షల నగదు, నగలతో వాళ్ల ఇంటికి ఉడాయించింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు సీమాను అరెస్ట్ చేశారు. మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లలో ధనవంతులను నిత్య పెళ్లి కూతురు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటికే విడాకులు తీసుకున్న లేదా భార్యలు చనిపోయిన వారిని ఈ మోసాలకు ఎంచుకునేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story