High Court: మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట

by Gantepaka Srikanth |
High Court: మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి(Patnam Narender Reddy)కి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో భారీ ఊరట లభించింది. సోమవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. బొంరాస్‌పేట పీఎస్‌(Bomraspet Police Station)లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. లగచర్ల దాడి(Lagacharla Case) ఘటనలో ఇప్పటికే బెయిల్‌పై బయటకు వచ్చిన నరేందర్‌రెడ్డిపై.. లగచర్ల ఘటనకు ముందే బొంరాస్‌పేటలో ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుడా బెయిల్‌ ఇవ్వాలని నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణకు సహకరించాలని పట్నం నరేందర్‌ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి.. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed