- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి నిరాశపర్చిన సింధు.. చైనా మాస్టర్స్‌లో రెండో రౌండ్‌లోనే నిష్క్రమణ
దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి నిరాశపర్చింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో సింగపూర్ క్రీడాకారిణి యో జియా మెన్ చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత బలంగా పుంజుకున్న సింధు రెండో గేమ్ నెగ్గి పోటీలోకి వచ్చింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ దూకుడుగా ఆడింది. ఒక దశలో 13-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, అదే జోరును కొనసాగించకపోవడం, పలు తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సింధు 2022లో చివరిసారిగా ఓ టోర్నీ విజేతగా నిలిచింది.
యువ షట్లర్లు అనుపమ ఉపాధ్యాయ ,మాళవిక బాన్సోద్‌లు కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టారు. మరోవైపు, స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-16, 21-18 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ రాస్మస్ గెమ్కెపై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ టోర్నీలో ముందడుగు వేసింది. రెండో రౌండ్‌లో సాత్విక్ జంట 21-19, 21-15 తేడాతో రాస్మస్ క్జెర్-ఫ్రెడెరిక్ సొగ్గార్డ్(డెన్మార్క్) జోడీపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జంట నిరాశపరిచింది. రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 16-21, 11-21 తేడాతో చైనాకు చెందిన లియు షెంగ్ షు-టాన్ నింగ్ ద్వయం చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది.