Palla Srinivasa Rao:సంధ్య థియేటర్ ఘటన పై పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-22 11:55:33.0  )
Palla Srinivasa Rao:సంధ్య థియేటర్ ఘటన పై పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 (Pushpa-2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట (Stamped) జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) ఐసీయూ (ICU) విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై నేడు(ఆదివారం) విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

హీరోలు వస్తే అక్కడ రద్దీ నెలకొంటుంది కాబట్టి అక్కడికి హీరోలు వెళ్లకపోవడమే మంచిదని పేర్కొన్నారు. సినిమా బెనిఫిట్ షోలు ఇక నుంచి ఉండవు అనే దానికి తాను వ్యతిరేకమని తెలిపారు. ఈ క్రమంలో బెనిఫిట్ షోలు(Benefit Show) వేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్ప-1 హిట్ అయిందని.. అలాగే పుష్ప-2 కూడా హిట్ అవుతుందనే ఆలోచన అందరిలో ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు(Government) కూడా ముందుచూపుతో వ్యవహరించాలని హితవు పలికారు. థియేటర్ల దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేకాదు దుర్ఘటనలు(Accidents) జరగకుండా చూడాల్సిన బాధ్యత అటు సినిమా వాళ్ల మీద.. ఇటు ప్రభుత్వం పై కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకోకుండా.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed