పేర్ని నానిని ఉరి తీయాలి: టీడీపీ సీనియర్ నేత డిమాండ్

by srinivas |
MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సమయంలోనూ 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అండ్ కో విదేశాలకు తరలించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Former MLC Buddha Venkanna) అన్నారు. బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు కృష్ణపట్నంతో పాటు పలు రేవులను ఆక్రమించారని ఆరోపించారు. ఆఫ్రికా లాంటి దేశాలకు బియ్యం తరలింపు కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని(Former YCP MLA Perni Nani) లాంటి వాళ్లను పదిమందిని ఏజెంట్లుగా నియమించుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అక్రమ తరలింపు బయటకు వచ్చిందని బుద్దా వెంకన్న మండిపడ్డారు.


కృష్ణా జిల్లాకు చెందిన పందికొక్కు, బియ్యపు దొంగ పేర్ని నాని విషయం కూడా బయటపడిందని బుద్దా వెంకన్న తెలిపారు. పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద గోదాము ఉందన్నారు. ఏ తప్పు చేయని పేర్ని నాని, ఆయన కుమారుడు, కుటుంబం ఏమై పోయారని ప్రశ్నించారు. 1999లో ఎన్నికల అఫిడవిట్‌లో పొందు పర్చిన ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. 2019లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన సమర్పించిన ఆఫిడవిట్‌లోని ఆస్తులు ఎంత అని నిలదీశారు. పెద్ద అవినీతి పరుడని ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు. పేద ప్రజల బియ్యం అక్రమంగా అమ్ముకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. గోదాము కట్టించి ప్రభుత్వ బియ్యాన్ని అందులో ఉంచి, దర్జాగా అమ్ముకున్నారని విమర్శించారు. మూడు ఎమ్మెల్యేగా పని పేర్ని నాని ఎక్కడున్నామని ప్రశ్నించారు. అక్రమంగా బియ్యం తరలింపుపై ఆరోపణలు వచ్చిన వెంటనే కోటి 70 లక్షలు చెక్ రాసిచ్చారంటే ఎన్ని వందల కోట్లు దోచుకున్నారో అర్థం చేసుకోవాలన్నారు. పేదల బియ్యాన్ని దోచేసిన పేర్ని నానిని ఉరి తీయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Advertisement

Next Story