Honda Activa: సరికొత్త ఫీచర్లతో హోండా యాక్టివా న్యూ వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |
Honda Activa: సరికొత్త ఫీచర్లతో హోండా యాక్టివా న్యూ వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!
X

దిశ,వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా స్కూటర్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హోండా యాక్టివా(Honda Activa) స్కూటర్లను మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే హోండా తన యాక్టివా 125సీసీ(Activa 125cc) సెగ్మెంట్​లో అప్డేట్ వెర్షన్(Updated Version)ను తాజాగా లాంచ్ చేసింది. హోండా యాక్టివా 125 డీఎల్ఎక్స్(DLX), యాక్టివా 125 హెచ్-స్మార్ట్(H-smart) పేరుతో రెండు రకాల వేరియంట్లలో వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. డీఎల్ఎక్స్ మోడల్ ధర రూ. 94,922గా, హెచ్-స్మార్ట్ వేరియంట్ ధరను రూ.97,146(Ex-Showroom)గా నిర్ణయించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ స్కూటర్ గరిష్టంగా 8.3బీహెచ్​పీ పవర్, 10.15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, నావిగేషన్‌, యూఎస్‌బీ టైప్‌-సీ చార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సైరన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్ వంటి డిఫరెంట్ కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story