Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మెదడుపై దీర్ఘకాల ప్రభావం..!

by Anjali |
Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మెదడుపై దీర్ఘకాల ప్రభావం..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. ఆలోచనల్ని, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. కాగా పలు రకాల అలవాట్ల కారణంగా మెదడుపై దీర్ఘకాల ప్రభావం చూపనుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పలు జాగ్రత్తలు పాటిస్తే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇయ‌ర్ ఫోన్స్‌..

తరచూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద సౌండ్స్‌తో సాంగ్ వినేవారి మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది. అలా చేయడం సరైంది కాదంటున్నారు నిపుణులు. దీంతో దీర్ఘకాలంగా చెవుల వినికిడి శక్తిపై ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో మెమోరీ లాస్, ఏకాగ్రత నశించిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం..

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం కూడా ఓ రకంగా మెదడుకు హాని కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం తిన్నాక.. రాత్రి తినేందుకు చాలా గ్యాప్ తీసుకుంటారు. దీంతో మెదడు మెద్దుబారిపోతుంది. మెదడుకు గ్లూకోజ్ సరిగ్గా అందక.. నీరసంగా తయారవుతుంది. రోజంతా యాక్టివ్ గా పనిచేయలేరు. చేసే పనిపై ఆసక్తి తగ్గిపోతుంది.

నిద్రలేమి సమస్య..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో అల్జీమర్స్ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయి. కాగా రోజూ కంటికి సరిపడ నిద్రలేకపోయినా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

కాగా ఈ అలవాట్లు ఉన్నవారు వెంటనే మానుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడు ఆరోగ్యం దెబ్బ తిని దీర్ఘకాలంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed