- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gurukula Schools: గురుకుల వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల వ్యవస్థ(Gurukula System)ను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి గురుకులాల బాట పట్టింది. ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు డైట్ చార్జీలు(Diet Charges), కాస్మోటిక్ చార్జీల(Cosmetic charges)ను 40 శాతం పెంచింది. డైట్ మెనులోనూ కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిన్న తప్పు జరిగినా కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎక్కడ, ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. గురుకులాల సెక్రటరీలు సైతం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అన్ని రకాల చర్యలు తీసుకుంటూ గురుకులాల్లో విద్యనభ్యసించే పిల్లలకు నాణ్యమైన భవిష్యత్ ను అందించేందుకు నిరంతరం శ్రమిస్తుంది.
గురుకులాలకు గ్రీన్ ఛానల్ బిల్లల చెల్లింపులు
గురుకులాలకు సప్లై చేసే కూరగాయలు, ఇతర సరుకుల బిల్లులు, మెస్ చార్జీలను త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా బిల్లుల చెల్లింపు ఆలస్యం కాదు. అయితే, గురుకులాలకు సప్లై చేసే కూరగాయాల కాంట్రాక్టర్లు పారదర్శకంగా వ్యవహరించకుండా నాసిరకం కూరగాయలు సప్లై చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, వాటిని అప్రూవల్ చేసిన వార్డెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 2004-14 మధ్య గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలు ఉండేవి కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా రద్దు చేయడంతో సమస్యలు తలెత్తాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను పునరుద్దరించింది. మెస్ ఛార్జీలు, అద్దె భవనాలు అద్దెలు ప్రతి నెల 10వ తేదిలోపు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులను చెల్లిస్తారు.
పౌష్టికాహారాన్ని అందించేదుకు ప్రత్యేక వ్యవస్థ
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికహారాన్ని అందించేందుకు, ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఫుడ్ సేప్టీ కమిటీలను వేశారు. చిన్న తప్పు జరిగినా అధికారులే పూర్తి బాద్యత వహించేలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. కామన్ డైట్ మెను ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. పెంచిన డైట్ ఛార్జీలతో డిసెంబర్ 14 నుంచి అమలులోకి రావడంతో 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అంతేకాకుండా, మెనూలో కూడా కీలక మార్పులు చేశారు. కామన్ డైట్ మెనూ, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్టోరేజి, అండ్ కిచెన్ డైనింగ్ ఏరియా మెయింటెనెన్స్, ద్వారా సమస్యలకు చెక్ పెట్టేలా వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. నెలలో రెండు సార్లు, మటన్, ఒక్కసారి చికెన్, గుడ్డుతో పాటు టమాట రైస్, పప్పు,పెరుగు, బగార రైస్, స్నాక్స్ కు మిల్లెట్ బిస్కెట్స్, బాయిల్డ్ పెసర్లు, ఫ్రైడ్ పల్లి,బెల్లం, బాయిల్డ్ బఠాణీ, బాయిల్డ్ బొబ్బర్లు, ఎగ్ బజ్జీ, ఇవే కాకుండా బ్రేక్ ఫాస్ట్ లోకూడా పలు మార్పులు చేసి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. అంతే కాకుండా.. మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందుతుందో లేదో చూసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.
గురుకులాలకు దశల వారీగా సొంత భవనాల నిర్మాణం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు సొంత భవనాలను నిర్మించకుండా, అద్దె భవనాల్లోనే కొనసాగించింది. దీనివల్ల సకాలంలో ఓనర్లకు బిల్లులు చెల్లించక, ఆ బిల్డింగుల ఓనర్లు భవనాలకు తాళాలు వేసుకుని వెల్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 216 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 327 బీసీ గురుకులాలు ఉంటే, 21 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 306 గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఒక్క బీసీలోనే కాదు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ముందుచూపుతో విశాలమైన క్రీడా మైదానాలు ఉండేలా 250 స్కూల్స్ ను, 25 ఎకరాల స్థలంలో 150 నుంచి 200 ఖర్చుతో ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గురుకులాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో వజ్ర సంకల్పంతో ముందుకు వెళ్తుంది. జిల్లా కలెక్టర్లు సైతం ఖచ్చితంగా నెలలో ఎన్ని గురుకులాలను సందర్శించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తుంది. బాత్రూమ్ లు, వంట గదులు, ఎలక్ట్రిసిటీ ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 667 కోట్లను విడుదల చేసింది. టీచింగ్ స్టాఫ్ సైతం ఎన్నో పరీక్షలు రాసి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. వారు 8 లక్షల మంది పిల్లలకు మార్గదర్శకత్వం అందించేందుకు వారి వృత్తిని సగర్వంగా, నిబద్ధతో నిర్వహిస్తే బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు మంచి భవిష్యత్ ను అందించిన వారవుతారు. అప్పుడే ప్రభుత్వ సంకల్పం కూడా నేరవేరుతుంది.