MP Anil Kumar Yadav : వైరల్ గా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ క్రికెట్ రికార్డు

by Y. Venkata Narasimha Reddy |
MP Anil Kumar Yadav : వైరల్ గా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ క్రికెట్ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav) క్రికెట్ రికార్డు(Cricket Record) సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral)గా మారింది. లోక్ సభ స్పీకర్..రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య రెండు సభలకు చెందిన ఎంపీలకు జరిగిన క్రికెట్ మ్యాచ్ లో అనిల్ కుమార్ అరుదైన రికార్డు సాధించారు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ వేసిన అనిల్ కుమార్ 3 బంతుల్లో 35 రన్స్ సమర్పించుకున్నాడు. ఇందులో అనిల్ యాదవ్ 13 బంతుల్లో 10 వైడ్స్ వేశారు. అనిల్ సరిగా వేసిన మూడు బాల్స్ ను కూడా బ్యాటర్ మనోజ్ తివారి ఫోర్లుగా మలిచాడు.

అనిల్ యాదవ్ ఆరు బంతుల ఓవర్ ముగించడంలో ఇబ్బంది పడటంతో ఇక లాభం లేదనుకున్న అంపైర్స్ ఆయనను బౌలింగ్ నుంచి తప్పించేసి మరో బౌలర్‌తో ఓవర్ ముగించారు. ఆ సమయంలో ఎంపీలు మనోజ్ తివారీ, దీపేంద్రహుడాలు బ్యాటింగ్ లో ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిన బౌలింగ్ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed