రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతోనే జీఓ 317 సమస్యకు శాశ్వత పరిష్కారం

by Sridhar Babu |
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతోనే జీఓ 317 సమస్యకు శాశ్వత పరిష్కారం
X

దిశ, జగిత్యాల టౌన్ : స్థానికత కోల్పోయి జీవో 317 ద్వారా ఇబ్బంది పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపెట్టవచ్చని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి .జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్టీయూ భవన్ లో స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా జోనల్ విధానాన్ని మార్చి పాత పది ఉమ్మడి జిల్లాలనే జోనల్ లుగా మార్చడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యారంగ సమస్యలపై మండలిలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, తన పరిధిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమం లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్, ప్రధాన కార్యదర్శి బైరం హరికిరణ్,జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు సిర్ణంచ రవీందర్, పాలెపు శివ రామకృష్ణ, కౌన్సిలర్ చుక్క నవీన్, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story