- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ షాక్ తో పోస్టల్ ఉద్యోగి మృతి
దిశ, నెల్లికుదురు: విద్యుత్ షాక్ కు గురై పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని రాజుల కొత్తపల్లికి చెందిన మహమ్మద్ అబ్బాస్ అలీ (59) పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఈ డి ఎం సి గా విధులు నిర్వహిస్తున్నారు. అబ్బాస్ అలీ తన ఇంటి ముందు రేకుల పందిరి పైన కోతులు దూకడంతో రేకులు చెదిరిపోయాయి. వాటిని సరి చేస్తున్న క్రమంలో సంబంధిత పందిరికి ఉన్న కరెంటు వైర్ షార్ట్ సర్క్యూట్ కు గురైంది. ప్రమాదవశాత్తు సంబంధిత రేకులకు తాకడంతో విద్యుత్ షాక్ కు గురయ్యారు. అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్బాస్ అలీ భార్య యాకూబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా అబ్బాస్ అలీ కి భార్యతో పాటు ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అబ్బాస్ అలీ తపాలా శాఖలో బ్యాగ్ కొరియర్గా కొన్ని దశాబ్దాలుగా రాజుల కొత్తపల్లి వెంకటాపురం, శ్రీరామగిరి, రావిరాల ల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.