- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
child marriage: అసోంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చర్యలు.. 400 మంది అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో బాల్య వివాహాలకు(child marriage) వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగానే 416 మందిని అరెస్టు చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Assam Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు. డిసెంబర్ 21-22 రాత్రి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆపరేషన్ లో భాగంగానే ఈ చర్యలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. 335 కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ''బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అసోం పోరాటాన్ని కొనసాగిస్తోంది. డిసెంబర్ 21-22 రాత్రి ప్రారంభించిన ఫేజ్ 3 ఆపరేషన్లలో 416 మందిని అరెస్టు చేశారు. 335 కేసులు నమోదు చేయబడ్డాయి. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సాంఘిక దురాచారాన్ని అంతం చేయడానికి మేం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటాం'' అని హిమంత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇకపోతే, అసోం ప్రభుత్వం 2023 ఫిబ్రవరి, అక్టోబర్ లో రెండు దశల్లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా డ్రైవ్ ను ప్రారంభించింది. ఫిబ్రవరిలో 3,483 మందిని అరెస్టు చేయగా, 4,515 కేసులు నమోదు చేశారు. కాగా.. అక్టోబర్ లో రెండో దశలో 915 మందిని అరెస్టు చేయగా 710 కేసులు నమోదయ్యాయి.