- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Goswami : మహిళల జట్టు మాజీ కెప్టెన్ గోస్వామికి అరుదైన గౌరవం
దిశ, వెబ్ డెస్క్ : భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులాన్ గోస్వామి (Jhulan Goswami)కి అరుదైన గౌరవం దక్కనుంది. మహిళ క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ఝులాన్ గౌరవార్ధం ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) లోని ఓ స్టాండ్‌కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఈ తరహా గౌరవం అందుకున్న మూడో క్రికెటర్‌గా, మొదటి మహిళగా ఈ దిగ్గజ పేసర్ చరిత్ర పుటల్లో నిలుస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈడెన్ గార్డెన్స్‌లోని స్టాండ్‌కు ఘులాన్ గోస్వామి పేరు ఖరారు చేస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) తెలిపింది.
2025 జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు, ఇంగ్లండ్‌ల మధ్య టీ20 మ్యాచ్ ఉంది. ఆ గేమ్‌కు ముందు క్యాబ్ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి స్టేడియంలోని బ్లాక్ బీలోని ఒక స్టాండ్‌కు ఘులాన్ గోస్వామి అని నామకరణం చేయనున్నారని తెలిపారు.