Rahul Gandhi : బైడెన్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి : ఎన్‌ఎంఓ - భారత్

by Hajipasha |
Rahul Gandhi : బైడెన్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి : ఎన్‌ఎంఓ - భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా భారత ప్రధాని మోడీకి మతిమరుపు వచ్చినట్టుంది’’ అంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ - భారత్ (ఎన్‌ఎంఓ - భారత్) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత చేసిన కామెంట్స్ వయో వృద్ధులను అవమానించేలా ఉన్నాయని మండిపడింది. ‘‘బైడెన్‌(Joe Biden)కు మతి తప్పింది.. ఆలోచనా శక్తిని కోల్పోయారు అనేలా రాహుల్ ఎద్దేవా చేయడం సరికాదు. బైడెన్ ఒక దేశ అధ్యక్షుడు. వయసులో రాహుల్ కంటే ఆయన పెద్దవారు. రాజకీయాల్లోనూ రాహుల్ కంటే ఎక్కువ అనుభవం బైడెన్‌కు ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఉంటే కాంగ్రెస్ అగ్రనేత అలా మాట్లాడి ఉండేవారు కాదు’’ అని ఎన్‌ఎంఓ - భారత్ సంస్థ ఆలిండియా ప్రెసిడెంట్ సి.బి.త్రిపాఠి పేర్కొన్నారు.

ఇలాంటి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు.ఈమేరకు ఒక లేఖను రాహుల్ తల్లి సోనియాగాంధీకి పంపారు. ‘‘మీరు ఒక సీనియర్ సిటిజెన్‌గా.. తోటి సీనియర్ సిటిజెన్ జో బైడెన్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యల గురించి ఒక్కసారి ఆలోచించండి. వయో వృద్ధులను అవమానించేలా, వయసు ప్రభావంతో వారికి వచ్చే ఆరోగ్య బలహీనతలను ఆటపట్టించేలా కామెంట్స్ చేయడం సరికాదు’’ అని లేఖలో సి.బి.త్రిపాఠి ప్రస్తావించారు. భారతదేశ లోక్‌సభ విపక్ష నేత లాంటి కీలక పదవిలో ఉండి రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed