Dulquer Salmaan: జీవితం అలా ఉందంటూ దుల్కర్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Dulquer Salmaan: జీవితం అలా ఉందంటూ దుల్కర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందారు. అంతేకాకుండా ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’(Kalki) చిత్రంలోనూ కామియో రోల్‌లో కనిపించి మెప్పించారు. ఇక ఇటీవల ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. గత కొద్ది రోజుల నుంచి ఓటీటీలోనూ ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) కాంబోలో ‘కాంత’ మూవీ రాబోతుంది. అలాగే ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టి‌వ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా, దుల్కర్ సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన భార్యకు వెడ్డింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు కూడా షేర్ చేశాడు.

‘‘ఒకరినొకరు భార్యాభర్తలు అని పిలవడం అలవాటు చేసుకోవడం నుండి, ఇప్పుడు మరియమ్, పాపా, మమ్మా అని పిలవబడే వరకు మేము చాలా దూరం వచ్చాము. జీవితం నేను బండి నడపడానికి ఇష్టపడే రోడ్లతో సమానంగా ఉంటుంది. మలుపులు, హెచ్చు తగ్గులు, కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్లు, గుంతలను కలిగి ఉందనిపిస్తుంది. కానీ ఉత్తమ సమయాల్లో సిల్కీ స్మూత్‌గా ఉంటుంది. మీ చేయి పట్టుకున్నంత కాలం మనం ఎక్కడికైనా చేరుకోగలమని నేను నమ్ముతున్నాను. ఇక్కడ మేము జీవితాంతం Mr & Mrsగా కలిసి ఉంటాం. నేను నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story