Trump Vs Harris: డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్.. వాదోపవాదాలతో దద్దరిల్లిన తొలి డిబేట్

by Shiva |
Trump Vs Harris: డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్.. వాదోపవాదాలతో దద్దరిల్లిన తొలి డిబేట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబెట్ దద్దరిల్లింది. వాషింగ్టన్‌లోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరిగిన డిబేట్ రసవత్తరంగా కొనసాగింది. ముందుగా ట్రంప్ మాట్లాడుతూ.. తాను అమ్మకం పన్నులు విధిస్తాననే మాట వాస్తవం కాదన్నారు. తమ ప్రభుత్వం హయాంలో కేవలం ఇతర దేశాలపై మాత్రమే సుంకాలు విధించామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ద్రవ్యోల్బణం 21 శాతానికి పెరిగిందని ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ధరలు అసాధాణంగా పెరిగాయని ధ్వజమెత్తారు.

ఆ ధరల పెరుగుదల ప్రజలకు ఓ విపత్తులా మారిందని అన్నారు. జైళ్లు, మానసిక కేంద్రాల నుంచి దేశంలోకి యథేచ్ఛగా వలస వస్తున్నారని ఆక్షేపించారు. అలా వచ్చి వాళ్లు తమ ఉద్యోగాలను సైతం లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆఫ్రికన్ అమెరికన్లను బైడెన్ దేశంలోకి అనుమతించారని ఫైర్ అయ్యారు. అమెరికాలో త్వరలో ఏం జరగబోతోందో ప్రజలే చూస్తారని ట్రంప్ తెలిపారు. హారిస్-బైడెన్ దేశాన్ని విపత్తులోకి నెట్టి ప్రమాదకరంగా మారారని పేర్కొన్నారు. నేరాల తీవ్రతలో ఉచ్ఛ స్థాయికి వెళ్లారని.. ఈ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉత్తమ ఆర్థక విధానాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఒకవేళ హారిస్ అధ్యక్షురాలు అయితే రెండేళ్లలో ఇజ్రామెల్ ఉనికి లేకుండా పోతుందని ట్రంప్ ఆరోపించారు.

విదేశీ విధానంలో ట్రంప్ బలహీనం: కమలా హారిస్

విదేశీ విధానంలో డొనాల్డ్ ట్రంప్ చాలా బలహీనంగా ఉన్నారని కమలా హీరిస్ ఆరోపించారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని అన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. తమను తాము కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అన్నారు. హమాస్ 1200 మంది ఇజ్రాయెల్ దేశస్థులను ఊచకోత కోసిందని గుర్తు చేశారు. ఎప్పటికైనా గాజాను పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. ప్రపంచ దేశాధినేతలు ట్రంప్‌ను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అబార్షన్ విధానం అమెరికా మహిళలకు అవమానం జరిగిందని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ ప్రేమ లేఖలు ఇచ్చిపుచ్చుకున్నారని ఆరోపించారు. ఆఫ్గాన్‌ నుంచి సైనికుల ఉపసంహరణపై బైడెన్ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్ధిస్తున్నాని స్పష్టం చేశారు. జాతి ఆధారంగా అమెరికా ప్రజలపే ట్రంప్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాడని హారిస్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story