- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ మీరే సీఎం కావాలి.. చంద్రబాబును కోరిన 97 ఏళ్ల వృద్ధుడు
దిశ, ఏపీ బ్యూరో: ఆయన పేరు కట్టా పెదవేమారెడ్డి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం గ్రామం. వయసు 97ఏళ్లు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం. చంద్రబాబును కలుసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ కుదరడం లేదు. 97 ఏళ్ల రావడంతో ఇప్పటికైనా తనకు చంద్రబాబును కలిసే అవకాశం ఇవ్వాలంటూ అందర్నీ అడిగాడు. ఇంతలో పెదవేమారెడ్డి కరోనా బారినపడి అతికష్టంమీద కోలుకున్నారు. ఇప్పటికైనా తాను చంద్రబాబును కలవాలని అందుకు సహకరించేలా ప్రయత్నించాలంటూ కుటుంబ సభ్యులు, సన్నహితులకు పదేపదే అడిగేవాడు. దీంతో వారు స్థానిక టీడీపీ నేతలకు విషయం తెలిపారు.
స్థానిక తెలుగుదేశం పార్టీనేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు పెదవేమారెడ్డిని అమరావతిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఆ వృద్ధుడితో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో పెదవేమారెడ్డి మురిసిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మళ్లీ మీరే సీఎం కావాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని…మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపాడు. చంద్రబాబును కలిసిన తర్వాత బయటకు వచ్చిన పెదవేమారెడ్డి ఆనందంతో ఉప్పొంగిపోయాడు.