Bumrah : అశ్విన్ రికార్డు సమం చేసిన బుమ్రా.. మరో సారి నెంబర్ 1గా..

by Sathputhe Rajesh |
Jasprit Bumrah Surpasses Bhuvneshwar Record to create new record
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్.1 బౌలర్ స్థానాన్ని నిలుపుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు (904) సాధించి అశ్విన్ రికార్డును సమం చేశాడు. అశ్విన్ డిసెంబర్ 2016లో ఈ ఘనత సాధించాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దీంతో 14 రేటింగ్ పాయింట్లను పొందాడు. బుమ్రా తర్వాత 856 పాయింట్లతో కగిసో రబడా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా కన్నా 48 పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ఆసీస్ పేస్ బౌలర్ హేజిల్‌వుడ్ 852 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ బ్యాటింగ్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌పై వరుసగా సెంచరీలతో రాణిస్తున్న ట్రావిస్ హెడ్ జైస్వాల్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరాడు. జైస్వాల్ ఐదో స్థానానికి పడిపోయాడు. రిషభ్ పంత్ రెండు స్థానాలు డౌన్ అయి 11వ స్థానంలో నిలిచాడు. మూడో టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed