శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన

by srinivas |
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు(Vaikuntha Dwara darshan) కల్పిస్తున్నట్లు ఈవో శ్యామలారావు(TTD EO Sri Shyamala Rao) తెలిపారు. జనవరి 9న ఉదయం 5 నుంచి టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. సర్వదర్శనం టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల శ్రీవారిని(Tirumala Srivaru) దర్శించుకోవాలని సూచించారు. జనవరి 10, 11, 12 తేదీల్లో మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మిగిలిన రోజులకు ముందురోజు టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మున్సిపల్ గ్రౌండ్స్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, ఎంఆర్ పల్లి పాఠశాలలను అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.


తిరుమల స్థానికుల కోసం తిరుమలలోని బాలాజీ నగర్‌లోని హాలులో 87 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 4 కౌంటర్లు కలిపి మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోవింద మాల భక్తులకు ప్రత్యేక టికెట్లు లేవని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, ఈసారి టోకెన్లు పొందిన భక్తులకు వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ 10 రోజుల పాటు టోకెన్లు లేని భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. కౌంటర్లు వద్దకు భక్తులు వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భక్తులు ఈ మేరకు ప్లాన్ చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని ఈవో శ్యామలారావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed