Over sharing : సోషల్ మీడియాలో ఓవర్ షేరింగ్‌‌.. మోసపోతారు జాగ్రత్త!!

by Javid Pasha |
Over sharing : సోషల్ మీడియాలో ఓవర్ షేరింగ్‌‌.. మోసపోతారు జాగ్రత్త!!
X

‌దిశ, ఫీచర్స్ : ఎన్నడూ పరిచయం లేనివ్యక్తి కనిపిస్తేనో, పలకరిస్తే అదోలా చూస్తాం. మనతో మాటలు కలుపుతుంటే అంత ఈజీగా నమ్మం. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు కొందరు. ముక్కూ మొహం తెలియని వారు కూడా హాయ్ చేప్పేస్తే వెంటనే కనెక్ట్ అయిపోతారు. అంతేకాకుండా తమ ఫొటోలు, వీడియోలు, ఆర్థిక వ్యవహారాలు వంటి విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఎప్పుడు ఏం చేస్తున్నది, ఎక్కడికి వెళ్తున్నది కూడా లైవ్‌లో చెప్పేస్తుంటారు. దీనినే నిపుణులు ‘ఓవర్ షేరింగ్’ అంటున్నారు. ఇలా ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునే వారు ‘సైబర్ స్టాకింగ్‌’ బారినపడి మోసపోయే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఈ ఓవర్ షేరింగ్‌తో సైబర్ స్టాకర్లు మీ సమాచారాన్ని హ్యాక్ చేయడానికి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి, మోసం చేయడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి పర్సనల్ విషయాలను పంచుకోవద్దంటున్నారు నిపుణులు. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం.

డేటాను ట్రాక్ చేసే అవకాశం?

సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వాలనే మీ కోరికను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మల్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మీరు తరచుగా షేర్ చేసే వీడియోలు, ఫొటోలు, వాటికి వచ్చే లైకులు, షేరింగ్‌లు వంటివి ట్రాక్ చేస్తూ మోసం చేసేందుకు సైబర్ స్టాకర్లు రెడీగా ఉంటారు. మీ మాటలు, షేరింగ్‌లను బట్టి మీ ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేస్తారు. ఫేక్ ఎకౌంట్లతో మిమ్మల్ని ఫాలో అవుతూ, బ్యాంక్ ఎకౌంట్, బ్యాలెన్స్ వంటి అంశాలను తెలివిగా రాబడతారు. స్నేహితులుగా పరిచయమై ఛాటింగ్ చేస్తూ.. మీ వ్యక్తిగత వివరాలను రికార్డ్ చేస్తారు. మీరు అమాయకులని భావిస్తే బెదిరింపులు లేదా బ్లాక్ మెయిలింగ్‌కు కూడా పాల్పడతారు. చెప్పింది వినకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను వైరల్ చేస్తామని దబాయిస్తారు. ఇలాంటప్పుడే కొందరు భయాందోళనలకు లోనవుతారు. ఇలా సైబర్ మోసగాళ్ల బారిన పడి సూసైడ్ చేసుకున్నవారు కూడా లేకపోలేదు. కాబట్టి సోషల్ మీడియాలో షేర్ చేసే కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలను సోషల్ మీడియాలో చర్చించడం, షేర్ చేయడం తప్పు కాదు. కానీ ఏదైనా సమస్య వస్తే కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలను, కుటుంబ వివరాలను, ఆర్థిక వ్యవహారాలను పంచుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇతరులు మిమ్మల్ని ట్యాగ్ చేసే అవకాశం లేకుండా ఓన్లీ సెలెక్టివ్ మెంబర్స్‌కు లేదా ఫ్రెండ్స్‌కు మాత్రమే పరిమితం చేయడం బెటర్. నిత్యం లాగిన్ అయి ఉండటం మంచిది కాదు. డైలీ ఒక్కసారైనా లాగౌట్ చేయడం మంచిది. అలాగే పాస్ వర్డ్స్ కూడా ఈజీగా ఉండేలా కాకుండా, స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి. బయట ఆన్‌లైన్ కేంద్రాల్లోనో, పబ్టిక్ సిస్టమ్స్‌లోనో వీలైనంత వరకు సోషల్ మీడియా ఎకౌంట్స్ యూజ్ చేయకపోవడం బెటర్. అలాగే ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే వెంటనే యాక్సెప్ట్ చేయకండి. వారి ప్రొఫైల్స్ చెక్ చేసి, నమ్మదగినది అనిపిస్తేనే అప్పుడు యాక్సెప్ట్ చేయడం బెటర్. ఇక మెసేజింగ్ యాప్‌లను వాడాల్సి వస్తే end-to-end encrypted ఉన్నవాటినే వాడాలంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా వేదికగా మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, అకౌంట్ హ్యాక్ అవుతున్నట్లు అనుమానం వచ్చినా సంబంధిత ఎకౌంట్స్ బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం, మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్‌లో గానీ, cybercrime.gov.ఇన్ సైట్‌లో గానీ ఫిర్యాదు చేయడం మర్చిపోవద్దు.

Advertisement

Next Story

Most Viewed