Parliament: పార్లమెంటు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. 90 శాతం కాలిన శరీరం

by vinod kumar |
Parliament: పార్లమెంటు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. 90 శాతం కాలిన శరీరం
X

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవనం (Parliament Building) సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బుధవారం మధ్యాహ్నం 3:35గంటల ప్రాంతంలో పార్లమెంటు ఎదురుగా ఉన్న రైల్వే భవన్ (Railway bavan) వద్దకు వచ్చిన వ్యక్తి తనకు తానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అనంతరం మెయిన్ గేటు వైపు నుంచి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత వ్యక్తిని రక్షించేందుకు అగ్నిమాపక యంత్రాన్ని వెంటనే ఘటనాస్థలికి పంపారు. అయితే అప్పటికే వ్యక్తి తీవ్రంగా కాలి గాయాలు కావడంతో స్థానికులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరం 90 శాతం కాలిపోయినట్టు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బాగ్ పత్‌కు చెందిన జితేంద్ర (Jithendra)గా పోలీసులు గుర్తించారు. సూసైడ్‌కు పాల్పడటానికి గల కారణాలను వెల్లడించలేదు. అయితే బాగ్‌పత్‌లో అతనిపై 2021లో నమోదైన ఓ కేసు కారణంగా ఆయన కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed