Ashwin : వీడ్కోలు మ్యాచ్ ఆడకపోవడంపై ఆశ్విన్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Ashwin : వీడ్కోలు మ్యాచ్ ఆడకపోవడంపై ఆశ్విన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఫేర్ వెల్ మ్యాచ్ ఆడకున్నా నో ప్రాబ్లమ్ అని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ అన్నాడు. బుధవారం ఓ యూట్యూబ్ షో‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ‘గ్రాండ్ వీడ్కోలు ఇవ్వడం తప్పు అని నేను భావిస్తా. నా కోసం ఎవరూ ఒక్క చుక్క కన్నీరు కార్చొద్దనుకుంటాను. మనమెందుకు ఇంకొకరి వెనక పరిగెత్తాలి. కానీ ఒకరు సాధించిన విజయాలు, విడిచిపెట్టిన వారసత్వంతో ప్రేరణ పొందాలని భావిస్తాను. నేను సంబరాలు చేసుకోవడం కోసం మ్యాచ్ నిర్వహించడం అంటే అది ఆటకే అవమానం అవుతుంది. ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. 537 వికెట్లు తీశాను.. దాంతోనే సంతోషంగా ఉన్నాను. అక్కడ లేని దాని గురించి ఆలోచించి నేనేందుకు బాధ పడాలి. నా జీవితంలో ఈ పార్ట్‌ను మాత్రమే వదిలేశాను. నేను క్రికెట్ గురించి మాట్లాడగలను. కోచింగ్ ఇష్టపడతాను. క్రికెట్ తన చుట్టూ ఉంటే సంతోషంగా ఉంటాను. క్రికెట్‌తో ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటా..’ అని అశ్విన్ అన్నాడు. క్రికెట్‌కు రిట్మైర్మెంట్ పలికిన తర్వాత ఒక్క చుక్క కన్నీరు కార్చలేదని అశ్విన్ అన్నాడు. నా వీడ్కోలు వెనక ఎవరూ లేరని తేల్చి చెప్పాడు. ఎవరైనా ఉన్నా తనకు మాత్రం ఆ విషయంపై అవగాహన లేదన్నాడు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed