‘రహదారులు బాగు చేయించండి’.. యువకుల వినూత్న నిరసన

by Jakkula Mamatha |
‘రహదారులు బాగు చేయించండి’.. యువకుల వినూత్న నిరసన
X

దిశ,వెబ్‌డెస్క్: గ్రామాలలో రహదారులు(roads) అధ్వాన్నంగా ఉంటే.. వాటిని బాగు చేయించాలని రోడ్ల పై నిరసన తెలియజేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ.. విజయనగరం(Vizianagaram) జిల్లాలో వినూత్న రీతిలో రహదారి గుంతల మయంగా ఉందంటూ నిరసన తెలిపారు. అసలు విషయంలోకి వెళితే.. విజయనగరం జిల్లా, వంగర మండలం కొండవలస గ్రామం నుంచి భాగెమ్మపేట వరకు సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే రహదారి నిత్యం గుంతలమయం గా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2010 నుంచి ఇప్పటివరకు కూడా రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో వాహనాదారుల ఇక్కట్లు వర్ణనాతీతం.

ఈ రహదారిలో ప్రయాణించే వాహనదారులు(Motorists) కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం(AP Government) అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందన్న ధోరణితో యువకులు వినూత్నంగా తమ నిరసన(Protest) తెలిపి, రహదారిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. డ్రోన్ కెమెరా(Drone camera)ను ఉపయోగించి, నూతన రహదారి(roads) నిర్మించాలని కోరుతూ ఆ రహదారిలో ప్లకార్డులు వారు ప్రదర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు రహదారి నిర్మించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed