CM Chandrababu: ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ

by Shiva |
CM Chandrababu: ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌ (Central Annual Budget)లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర సర్కార్ వాటా, నిధుల కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా పలు కీలక ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను సీఎం, ప్రధాని మోడీ (PM Modi) దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా గత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించారని సమాచారం. రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌లో కేటాయించిన రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం త్వరగా అందజేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu)కోరారు. ఇక వైజాగ్ రైల్వే జోన్ (Vizag Railway Zone) శంకుస్థాపనకు రావాలని కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ఆయువుపట్టు అయిన పోలవరం (Polavaram) నిర్మాణానికి సహకారం, వరద సెస్‌కి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీని కోరగా.. ఆయన సావధానంగా విని సానుకూలంగా స్పందించారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed