Telangana News: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

by Vinod kumar |   ( Updated:2022-04-15 13:46:30.0  )
Telangana News: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, ఇందల్వాయి: తెలంగాణ ప్రభుత్వానికి రావలసిన రూ.2 లక్షల కోట్ల కేంద్ర బీజేపీ పార్టీ దోచుకుంటే.. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లు కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి చేస్తలేరని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని NH 44 నుండి త్రియంబక్ పేట్, గండి తాండ వరకు ఇందల్వాయి, ఇందల్వాయి తాండ BT రోడు రీన్వేల్, ప్రత్యేక మరమ్మత్తుల కోసం ఒక కోటి ఎనభై లక్షలు మంజూరు అయినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పలు పనులకు శంకుస్థాపన చేశారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నట్లైతే తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తాను ప్రత్యేక్షంగా చూశానన్నారు. అదే తెలంగాణలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఐసీడీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేష్ నాయక్, జడ్పీటీసీ సుమన రవిరెడ్డి, గడీల రాములు, పార్టీ మండల అధ్యక్షుడు దాస్, శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, పాశం కుమార్, రఘు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు సుధాకర్, దాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాటి ఆప్యాయతనే.. నేడు కలిసింది..


మాజీ పీఏసీఎస్ చైర్మన్ టీఆర్ఎస్ లో చేరిక. ఇందల్వాయి మాజీ పీఎసీఎస్ చైర్మన్ పాశం నర్సింలు, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed