- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చోరీలకు పాల్పడతున్న మైనర్బాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దిశ, చార్మినార్ : జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడతున్న ఓ మైనర్ బాబుని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మైనర్బాబుని టాస్క్ ఫోర్స్ పోలీసులు హుస్సేనిహాలం పోలీసులకు అప్పగించారు. సౌత్ జోన్ టాస్క్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ... హైదరాబాద్ లాన్సర్ ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ యువకుడు 3వ తరగతి వరకు చదువుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి రెండు ద్విచక్రవాహనాలతో పాటు ఒక సెల్‌ఫోన్ ను దొంగిలించాడు. విలాసవంతమైన జీవితం కోసం హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి తాళాలు పగుల కొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మైనర్బాబుని హుస్సేనిహాలం వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ పర్యవేక్షణలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కె. నర్సిములు, ఎం. మహేష్, జి. ఆంజనేయులు, ఎన్. నవీన్ బృందం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 85 గ్రాముల వెండి బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్ఫోన్లు, రూ. 6200 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మైనర్బాబుని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హుస్సేనిహాలం పోలీసులకు అప్పగించారు. ఈ కేసును హుస్సేనిహాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.