గ్రిల్స్ మధ్యలో ఇరికిన బాలుడి తల..

by Aamani |
గ్రిల్స్ మధ్యలో ఇరికిన బాలుడి తల..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలుచున్న క్రమంలో ఐరన్ గ్రిల్స్ లో బాలుడి తల ఇరుక్కుపోయిన సంఘటన యాదగిరిగుట్టలో ఆదివారం చోటుచేసుకుంది.‌ బోడుప్పల్ చెందిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థమై క్యూ లైన్ లో వెళ్తున్నారు. ఈ క్రమంలో దయాకర్ అనే బాలుడి తల పొరపాటున గ్రిల్స్ లో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ఆలయ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుని తల ఐరన్ గ్రిల్స్ నుంచి బయటికి తీశారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బాలుని తల బయటకు తీయడం తో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story