- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భర్త
దిశ, బడంగ్ పేట్ : అతిగా మద్యం సేవించి భార్యను చితకబాది ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన భర్త అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.... వాదియే సాలేంకు చెందిన హజిరా ఫాతిమా, మొహమ్మద్ వాసిమ్ (30) వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్ళైన నాటి నుంచి మొమహ్మద్ వాసిమ్ చిత్తుగా మద్యం సేవించి భార్యతో తరచు గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం కూడా చిత్తుగా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు
భార్యను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. అత్తగారింటికి శుక్రవారం వెళ్ళిన మొహమ్మద్ వాసిమ్ అక్కడ కూడా మరోమారు భార్యపై చేయిచేసుకున్నాడు. నీకు విడాకులిస్తానని భార్యను బెదిరించి ఇంటికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా మద్యం సేవించి ఇంట్లోకి వెళ్ళాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి ఇంట్లో మొహమ్మద్ వాసిమ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కనిపించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాసిమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.