Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పది ఇళ్లు దగ్ధం

by Ramesh Goud |
Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పది ఇళ్లు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District)లో భారీ అగ్ని ప్రమాదం(Major Fire Broke) చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో(Gas Cylinders Exploded) పలు ఇళ్లు దగ్ధం(Houses Were Gutted) అయ్యాయి. ఘటన ప్రకారం సంతకవిటి మండలం(Santhakaviti Mandal) సిరిపురం గ్రామం(Siripuram village)లో శనివారం సాయంత్రం వేళ ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ఆయా ఇళ్లలోని ఐదు గ్యాస్ సిలిండర్లు పేలి పెద్ద ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు పది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటల్లో చిక్కుకొని ఎవరికైనా గాయాలు అయ్యాయా..?, ఎవరైనా మరణించారా..? అనేది అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియరాలేదు.

Advertisement

Next Story

Most Viewed