ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్..ఇద్దరు యువకుల మృతి

by Aamani |
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్..ఇద్దరు యువకుల మృతి
X

దిశ,ధర్మారం: బంజేరుపల్లి గ్రామానికి చెందిన నునావత్ రాజశేఖర్, భానోత్ సంతోష్ నాయక్ ఇద్దరూ వారి సొంత పనిమీద ధర్మారం వెళ్లి తిరిగి వారి బైక్ పైన తమ గ్రామానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో హైవే పైన లారీని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఎలాంటి సూచికలు లేకుండా నిలిపి ఉంచగా,ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ తో ఢీకొనగా సంతోష్ నాయక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.తనతో పాటు ఉన్న రాజశేఖర్ కి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రాజశేఖర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై ఎస్.లక్ష్మణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed