New Year's Celebrations : న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ నిఘా

by Y. Venkata Narasimha Reddy |
New Years Celebrations : న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ నిఘా
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల(New Year's Celebrations)పై ముందెన్నడు లేని రీతిలో ఈ దఫా పోలీస్ (Police)శాఖ ప్రత్యేక నిఘా వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government)డ్రగ్స్ రహిత తెలంగాణ(Drug-Free Telangana)..డ్రగ్స్ రహిత హైదరాబాద్(Drug-Free Hyderabad) లక్ష్యాలను నిర్ధేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారులలో, జిల్లాల్లోని ముఖ్య నగరాల్లో, ఫామ్ హౌస్ లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు, హోటళ్లపై పోలీస్ శాఖ ఓ కన్నేసి పెట్టింది. సివిల్ పోలీస్ తో పాటు నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి పోలీస్ విభాగాలు ఆకస్మిక తనిఖీలకు రంగం చేసుకున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. బార్లు, పబ్ ల లైసెన్స్ లను తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టాయి. మైనర్ లను బార్లు, పబ్ లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డీజేలతో హంగామా చేయవద్ధని, నిషేధానికి సహకరించాలని స్పష్టం చేశారు. సౌండ్ పొల్యూషన్ తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed