- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇలాంటి గ్రామాలే..ఈ దొంగల టార్గెట్
దిశ, భిక్కనూరు : దొంగలు కొత్త దారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల మాదిరిగా డూప్ వేషధారణతో తయారై,గ్రామాల్లో మారణాయుధాలతో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న గ్రామాలను టార్గెట్ గా చేసుకొని ,ఐదు నుంచి పది మంది సభ్యులతో కూడిన గ్యాంగ్,తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం 44వ హైవే ఆనుకొని ఉన్న కామారెడ్డి జిల్లా భి క్కనూరు, సిద్ధ రామేశ్వర నగర్ గ్రామాలలో కట్టర్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో రాత్రివేళ సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడ్డారు.అయితే ఆయా గ్రామాల్లో వారి ఇండ్ల ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ లను చూసి, ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పోలీస్ డ్రెస్ తో పాటు, మంకీ క్యాప్ లు ధరించిన గ్యాంగ్ సభ్యులు సిద్ధ రామేశ్వర నగర్ లో తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు, లక్ష రూపాయల నగదును, వెండి వంటి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. అయితే జనరల్ ఐటమ్స్ అమ్మే మాదిరిగా గ్రామాల్లో తిరుగుతూ, రాత్రివేళ చోరీలకు పాల్పడడం వారి స్పెషాలిటీ అని తెలుస్తోంది. ముఖ్యంగా చోరీలకు పాల్పడిన వెంటనే ఎస్కేప్ అయ్యేవిధంగా రహదారులను ఆనుకొని ఉన్న గ్రామాలను ఎంచుకుంటుండడంతో.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే గ్యాంగ్ సభ్యులు జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఇదే విధమైన చోరీలకు పాల్పడిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.