వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

by Sridhar Babu |
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
X

దిశ, మంచిర్యాల : వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు, ఇతర వాహనాల వారు సీట్​బెల్ట్ తప్పనిసరిగా పాటించాలన్నారు. కూడళ్ల వద్ద సిగ్నల్స్​ తప్పనిసరిగా అనుసరించి నియంత్రిత వేగంతో వాహనాన్ని నడపాలని తెలిపారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు.

వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటుందని వేగ నిరోధకాలతో పాటు వాహనదారులు అర్థమయ్యే విధంగా ప్రమాద ప్రాంతాలు మూలమలుపు ప్రాంతాలలో నిబంధనలు పాటించాలని తెలిపారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా రవాణా శాఖ నుండి సేవలను మరింత వేగంగా అందించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమ, నిబంధనలను వివరిస్తూ ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed