అది తప్ప ఏం వదులుకోవడానికైనా సిద్ధమే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2025-01-02 15:49:53.0  )
అది తప్ప ఏం వదులుకోవడానికైనా సిద్ధమే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy CM) పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) గురువారం సాయంత్రం విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని(Book Exhibition) ప్రారంభించారు. ఈ బుక్ ఎగ్జిబిషన్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Municipal Stadium) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పుస్తక ప్రదర్శన ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. " జీవితంలో తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకం ఇచ్చింది. అటువంటి పుస్తకాలను తన సంపద గా భావిస్తానని.. తన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తానని.. తన జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమై పోయే వాడినో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే రెండు చోట్ల ఓడిపోయిన పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయని. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కాగా ఈ 35వ పుస్తక ప్రదర్శన ఈ రోజు నుంచి జనవరి 12 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విజయవాడ బుక్ ఎగ్జిబిషన్(Vijayawada Book Exhibition) కొనసాగుతోందని VBFS కార్యదర్శి మనోహర్ నాయుడు తెలిపారు. ఇక పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామ కోటేశ్వర రావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్ టాటా పేర్లు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed