- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
by Kalyani |
X
దిశ, కొత్తూర్ : పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం… మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన చిర్ర కల్పన (26) భర్త యాదయ్య తో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం చేను దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉస్మానియా కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన కొండని శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతురాలికి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందని,అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story