AP Deputy CM:‘ఇంటర్‌తో చదువు ఆపేశాను.. కానీ’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-02 14:46:06.0  )
AP Deputy CM:‘ఇంటర్‌తో చదువు ఆపేశాను.. కానీ’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లో పుస్తక మహోత్సవం(Book Festival) ప్రారంభమైంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. ఇక విజయవాడలో మూడున్నర దశాబ్దాలుగా ప్రతి ఏడాది పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 35వ పుస్తక మహోత్సవాన్ని నేడు(గురువారం) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ క్రమంలో విజయవాడలో పుస్తక మహోత్సవంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంటర్‌తో చదువు ఆపేశాను కానీ చదవడం ఆపలేదు. రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను. నాకు పుస్తకాలు అంటే ప్రాణం. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన కారణాల్లో ఒకటి పుస్తకాలు. ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితల పై గౌరవం కలుగుతుంది’’ అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed